బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఈ నెల 7వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బీసీ మంత్రులు, అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈనెల 7న జరిగే బీసీ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించనున్న అంశాలను వివరించారు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్. మూడు ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని…
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆ టీడీపీ నాయకుడు ఫిక్స్ అయ్యారు. మరి.. వైసీపీ నుంచి ఆయనకు ప్రత్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీ పోరుకు సై అంటారా? ఇద్దరి మధ్య సవాళ్లు.. విమర్శలు ఇస్తున్న సంకేతాలేంటి? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..! కొద్దిరోజులుగా రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్..…
రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్‌ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత…
రాజమండ్రి వైసీపీలో ఇటీవల ఊహకందని చిత్రం పొలిటికల్ తెరపై కనిపించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా కలిసిపోయారు. ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు యువ నేతలు అనేకసార్లు రచ్చకెక్కారు. పార్టీ అధిష్ఠానం సైతం సయోధ్యకు విఫలయత్నం చేసింది. భరత్, రాజాలు కలవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ.. విభేదాలను పక్కన పెట్టేసినట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. వైసీపీలో సంస్థాగతంగా చేపట్టిన…