నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల రాజా అని, పాపం పండి నేడు పోలీసులు అరెస్టు చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారని, వారి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
టీడీపీ నేత నారా లోకేష్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టీడీపీ నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు.