టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై…