దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అటు భారత్ బంద్‌కు దేశంలోని పలు రంగాలకు చెందిన కార్మికులు కూడా…
ఈనెల 28, 29 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే అంతకన్నా ముందు మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు.…
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి…