పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను కోర్టు మార్చి 19న విచారించనుంది. CAA కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసిన ఒక రోజు తర్వాత, కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాని ఆశ్రయించింది.