Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్‌కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.