నైరుతి రుతుపవనాలుఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. రుతు పవనాల మూలంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబయిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.