ఆ నియోజకవర్గంలో అధికారపార్టీకి వారిద్దరు ప్రధాన నాయకులు. ఇద్దరూ పెద్ద పదవుల్లోనే ఉన్నారు. కాకపోతే కలిసి సాగే పరిస్థితిలేదు. అసమ్మతి నేతలను చేరదీసేవాళ్లు ఒకరు.. పట్టుకోల్పోకుండా ఎత్తుగడలు వేసేది ఇంకొకరు. ఇంకేముందీ నిత్యం రచ్చే. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుల్లో మానుగుంట మహిధర్ రెడ్డి ఒకరు. మాజీ మంత్రి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరోసారి కందుకూరు ఎమ్మెల్యే అయ్యారు. ముక్కుసూటిగా ఉండే మహీధర్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై…