త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ మిస్సయిపోయిందంటూ మన్సూర్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కశ్మీర్ షెడ్యూల్ లో మరీ దారుణంగా, సెట్స్ పై త్రిషను చూసే అవకాశం కూడా కల్పించలేదని చిత్రబృందంపై…