మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు…