మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్తగా కొనియాడుతోంది. ఆయన మరణం పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్‌ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు…
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. "ఇది మన్మోహన్ సింగ్ చివరి క్షణాల ఫొటో" అని పేర్కొంటున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంతో తెలుసుకుందాం..
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. కానీ, ఆయన భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.. మన్మోహన్ లేని…
26 డిసెంబర్ 2024 రాత్రి.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దేశానికి రెండుసార్లు (2004-2014) ప్రధానమంత్రిగా పనిచేసిన సాటిలేని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ తన 92వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన తీసుకొచ్చిన చాలా విధానాలు కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరి పోశాయి. అతలాకుతలమైన భారత ఆర్థిక వ్యవస్థకు పునర్జీవాన్ని అందించాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఆయనకు భావోద్వేగంతో నివాళులు అర్పిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే 7 రోజుల సంతాప దినాలు…