Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం ఎయిమ్స్‌లో మరణించారు. దాదాపుగా దివాళా అంచున ఉన్న దేశాన్ని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుంది. అప్పటి వరకు లైసెన్స్ రాజ్, బ్రూరోక్రసీ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థగా మార్చారు.