మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం…