Heavy Rains: తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి.