Edupayala Flood Alert: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్టు యొక్క గేట్లు ఓపెన్ చేయడంతో ఏడుపాయల వన దుర్గా దేవీ ఆలయానికి వచ్చే రెండు మార్గాలు బంద్ అయ్యాయి. లక్షకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో ప్రసాదాల పంపిణీ షెడ్డూ కొట్టుకుపోయింది.
Read Also: AI Tools : విద్యార్థుల నైఫుణ్యాలను తగ్గిస్తున్న ChatGPT .. అధ్యయనంలో వెల్లడి..
ఇక, ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం పైకప్పుని తాకుతూ ప్రమాదకర స్థాయిలో మంజీర నది పరవళ్లు తొక్కుతుంది. దీంతో పోతం శెట్టిపల్లి నుంచి ఏడుపాయల, మెదక్ నుంచి ఏడుపాయల ఆలయానికి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ మీదుగా వరద ప్రవహిస్తుంది. ఇక, పోలీసులు ప్రజలు ఎవరు కూడా అటుగా రాకుండా బారికేడ్లు పెట్టి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.