ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు…