యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” మార్చి 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీలోని నాల్గవ పాట “మాంగళ్యం”ను ఆవిష్కరించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట “మాంగళ్యం తంతునానేనా” అంటూ సాగుతూ… పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్న హీరో నిరాశను వ్యక్తం చేస్తుంది. అతని నిరాశకు కుటుంబం ఎలా అడ్డు…