ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్ అంతా ఒక సర్టిఫికెట్ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దుగ్గిరాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ రగడ..! కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నిక కోసం…