ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు అంటే.. అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేశారు.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్.. రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో నందిగం సురేష్ తమకు సహకరించలేదని కేసులో దర్యాప్తు కోసం.. విచారణ చేసుకునేందు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.