అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడికోసం ఆ ఎమ్మెల్యే ప్లాట్‌ఫారం సిద్ధం చేస్తున్నారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో.. అధికారపార్టీకి చెందిన ఇతర నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. బరిలో ఉంటామని సంకేతాలిస్తున్నారట. మరికొందరైతే అనుచరులను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో అలజడి మొదలైందట. అలంపూర్‌లో టీఆర్‌ఎస్ నేతల దూకుడుజోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాత, కొత్త నాయకులు…