Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది.