సాధారణంగా ప్రేమ, సాంగత్యం కోసం టిండర్ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఓ వ్యక్తి రక్షా బంధన్ కోసం సోదరీమణులను వెతుక్కోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించాడు. నిజమేనండి.. అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా దొరికారు. అతనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.