సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి ముందు కేసీఆర్ మల్లన్నకు పూజలు నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. మల్లన్న సాగర్ తెలంగాణకే తలమానికం అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన…
సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ మండలం పరిధిలోనున్న మల్లన్నసాగర్ జలాశయంను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదైన మల్లన్నసాగర్‌ను రాష్ట్రప్రజలకు కేసీఆర్ అంకితం చేయనున్నారు. మల్లన్నసాగర్ పూర్తిసామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో 30 టీఎంసీల నీటిని జంటనగరాల తాగునీటికోసం తరలిస్తారు. పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కొత్తపాత ఆయకట్టు కలిపి మొత్తం 15,71,050 ఎకరాలు రానున్నాయి. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున మొత్తం ఐదు…