కొమురవెల్లి మల్లన్న భక్తుల సుదీర్ఘ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించి.. భక్తులకోసం రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరం, భక్తుల సౌకర్యాన్ని వివరిస్తూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రికి లేఖలు రాయడంతో పాటుగా.. ప్రత్యేకంగా కలిసి ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వేశాఖ.. కొమురవెల్లి మల్లన్న జాతర…