ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.