ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి(96) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925లో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖరశాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు, ప్రఖ్యాతులు పొందారు. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేయడంతో చంద్రశేఖరశాస్త్రి చాలా ప్రసిద్ధి.…