Maldives: హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం మాల్దీవులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. భారతదేశంతో వివాదం, ప్రధాని నరేంద్రమోడీ గురించి ఆ దేశ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడటం ఒక్కసారిగా వివాదాస్పదమైంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు అనుకూలంగా, భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్జాతీయ మీడియాలో మాల్దీవులు హెడ్‌లైన్‌గా మారింది.