సాధారణంగా నూతన సంవత్సరాన్ని జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను నూతన ప్రారంభోత్సవంగా సెలెబ్రేట్ చేసుకుంటాము. అయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు విభిన్నమైన తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 15న కేరళలో సాంప్రదాయ మలయాళ నూతన సంవత్సర ప్రారంభాన్ని విషు అనే పేరుతో పండగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడమే కాకుండా కుటుంబంతో రుచికరమైన సాంప్రదాయ విందును ఆస్వాదిస్తారు. ఈ ప్రత్యేక…