Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్ తెరిచి వరద…