Su-57 Fighter Jet India: ప్రపంచ దేశాల్లో భారత్-రష్యా స్నేహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి ఆపద వచ్చినా సాయం చేయడానికి మరొక దేశం ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశంతో రష్యా తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. “భారతదేశం AMCA ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇందులో…
Tejas Mk-1A: భారత అమ్ముల పొదిలోకి తేజస్ కొత్త మార్క్ చేరనుంది. దేశ వైమానిక దళానికి కేంద్ర ప్రభుత్వం 97 తేజస్ యుద్ధ విమానాల బూస్టర్ డోస్‌ను ఇవ్వనుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రధాన ఒప్పందాన్ని ఆమోదించిన నెల తర్వాత, వైమానిక దళం బలోపేతం కోసం…
భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పూర్తి స్థాయిలో పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్‌లో అత్యాధునికమైన వెర్షన్. ఈ రైఫిల్ నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దీన్ని తయారు చేస్తున్నారు. ఇది భారత్- రష్యా మధ్య జాయింట్ వెంచర్. ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది.
Indian defence: రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది.