తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీనే సంక్రాంతి జరుపుకోవడం అలవాటు చేసుకున్నాం. కానీ, గత కొన్ని ఏళ్లుగా సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. మన దేశంలోని ఇతర పండుగలు చంద్రుడి గమనం (చాంద్రమానం) ప్రకారం మారుతుంటాయి, కానీ సంక్రాంతి మాత్రం సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా వస్తుంది. మరి ఇలాంటి పండుగ తేదీ ఎందుకు మారుతోందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన…