ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు.