Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని…