రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నేడు డీజీపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతరాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్ నేడు నగరంలోని ముగ్గురు పోలీస్ కమీషనర్లు, సి.వీ.ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఇంటలిజెన్స్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీలు అనీల్ కుమార్, జితేందర్, నార్త్ జోన్ ఏడీజీ నాగి రెడ్డి లతో…