మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది. చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్…