దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ కు…