మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
AAP: మహారాష్ట్రలో వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేయడం లేదని ప్రకటించింది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ-ఎస్పీ, ఉద్ధవ్ ఠాక్రే సేవ కోసం ప్రచారం చేస్తారని ఆ పార్టీ నే సంజయ్ సింగ్ శనివారం చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)-ఉద్ధవ్ ఠాక్రే శివసేన ‘‘మహా వికాస్ అఘాడీ(MVA)’’ పేరుతో కూటమిగా పోటీ చేస్తున్నాయి.
త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి కూడా అధికారం కోసం కసరత్తు ప్రారంభించింది.