అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో…