బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈరోజు హైదరాబాద్ మధురానగర్‌లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. గురువారం ఉదయం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు జాన్వీ కపూర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. మరోవైపు జాన్వీకపూర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌తో సెల్ఫీలు దిగేందుకు వారంతా పోటీ…