ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్…
ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూనివ్సిటీకి వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ నీ సీఎం చేసిందే విద్యార్దులు అని, విద్యార్ధుల దగ్గరకు…
ఎర్రబెల్లి, గంగుల, తలసాని, దానం లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన చేరారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అలాంటి వాళ్ళను కేసీఆర్‌ను పోగుడతున్నరని, 8 ఏండ్లుకు నోటిఫికేషన్లు నిన్న వచ్చాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంకు అప్పులు… కేసీఆర్ గొప్పలు.. జనంకు తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని, 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని,…
మరోసారి టీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్‌ఎస్ హౌలే…
విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ గురువారం విద్యుత్ సౌధ, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధర్నా చేసేందుకు అనుమతుల లభించడంతో తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా…
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమయింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై పూర్తి బాధ్యత నాదేనని స్పందించారు. ఇదిలా ఉంటే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ పార్టీలో క్రమశిక్షణ లోపం…
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన…
కాంగ్రెస్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిన్నా..మొన్న పుట్టిందని… నడకలు కూడా ఆమెకు రాలేదని తెలిపారు. అప్పుడే పరుగులు పెడతా అంటే ప్రకృతికి విరుద్ధమని… పురుడు పోసుకున్నది మొన్ననేనని చురకలు అంటించారు. 9 నెలలు అయితే.. అడుగులు నేర్చుకోవచ్చన్నారు. ఆమె పై అంతకు మించి మాట్లాడేది ఏముండదని… కాంగ్రెస్ నాయకుడిగా వైఎస్ ని గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అంటే కొంత గౌరవం ఉండేదని…కానీ నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు. read…
గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… అనేక విషయాలను ప్రస్తావించారు.. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించారు..…