ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తోలు మందం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి.. డబ్బు ఇసుక, చెరువులో మట్టి అమ్ముకుని సంపాదించుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.. ఇక, ఆంధ్ర రాష్ట్రంలో బుద్ధిలేని రాష్ట్ర నాయకత్వం పరిపాలిస్తోందని విరుచుకుపడ్డ ఆయన.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర ఇటువంటివి ఆటలు చెల్లవని హెచ్చరించారు. అంతేకాదు, రాష్ట్రంలో…