కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే, ప్యాండమిక్ సినిమాని డిలే చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇంకా కొంత భాగం షూటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిపోయాయి. అయితే, ఆ మధ్య రంజాన్ సందర్భంగా తొలి సింగిల్ ని విడుదల చేద్దామనుకున్నారు ‘మానాడు’ మూవీ దర్శకనిర్మాతలు. కానీ, సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు తల్లి అకాల మరణం పాలవటంతో రంజాన్ వేళ ఫస్ట్ సాంగ్ రాలేదు.…