‘మా’ అధ్యక్ష పదవి పోటీలో వున్నా మంచు విష్ణు నేడు తన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది తెలుగు సినిమా ఆత్మ గౌరవానికి చెందిన మేనిఫెస్టోగా మంచు విష్ణు తెలిపారు. మొదటి ప్రాధాన్యత అవకాశాలు కల్పించడమన్నారు. సొంత డబ్బులతో మా భవనం నిర్మిస్తానన్నారు. సొంతింటి కళతో పాటుగా.. వైద్య సహాయం.. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. అర్హుల పిల్లలకు కేజీ టూ పిజి ఉచిత విద్య.. సభ్యుల కుటుంబంలో పెళ్లికి కల్యాణ లక్ష్మీ కింద…
వరుస వివాదాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులపై విచారణ జరుగుతోంది. మరోవైపు “మా” అధ్యక్ష ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే “మా” అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీనితో “మా”లోని లొసుగులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి ప్రవేశించడం, బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేయడం వంటి విషయాలు మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి.…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…