Manchu Vishnu Gives Strong Warning To MAA Members: ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా.. మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా.. తాను అధ్యక్షుడిగా, అలాగే తన ప్యానెల్ ఏయే పనులు చేపట్టిందన్న విషయాల్ని వెల్లడించారు. ఒక్క మా బిల్డింగ్ మినహాయించి.. 90 శాతం వాగ్దానాలు పూర్తి చేశామని చెప్పాడు. 2021లో జరిగిన ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని తలపించాయని.. ఒక్క తెలుగు రాష్ట్రాలవారే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ఆడియన్స్ ఈ ఎన్నికల్ని ఓన్ చేసుకున్నారని తెలిపాడు. ఈ ఎన్నికల సమయంలో ఎంతో అలజడి నెలకొందని పేర్కొన్నాడు. మా అధ్యక్షుడిగా ఉన్న తాను కేవలం అసోసియేషన్‌కి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా జవాబుదారినేనని, అందుకే మీడియా ముందుకొచ్చి వివరాల్ని వెల్డిస్తున్నానని స్పష్టం చేశారు.
ప్రతిఒక్కరికీ అవకాశాలు కల్పించాలని తాను హామీ ఇచ్చానని, అందుకోసం ప్రత్యేక బుక్‌లెట్ తయారు చేశామని మంచు విష్ణు తెలిపాడు. దాని వల్ల పది మందికి అవకాశాలొచ్చాయని, మిగతా వారికి కూడా ఛాన్సులొస్తాయని అన్నాడు. అలాగే ‘మా’ కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌కి తయారు చేస్తున్నామని, సంక్రాంతి తర్వాత దాన్ని తీసుకొస్తామని చెప్పాడు. ప్రతీ ప్రొడక్షన్ హౌస్‌కి ఈ యాప్ యాక్సెస్ ఉంటుందని, నటీనటులు అందులో సినిమాలకు సంబంధించిన వివరాల్ని తెలుసుకోవచ్చని, నేరుగా ప్రొడక్షన్ సంస్థల్ని సంప్రదించవచ్చని పేర్కొన్నాడు. మహిళల సంరక్షణ కోసం తాము ఒక హైపవర్ కమిటీని తయారు చేశామని, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సునీత కృష్ణన్‌ని అడ్వైజరీగా ఆ కమిటీకి నియమించామన్నాడు. మా సభ్యత్వం పొదిన వారిలో 20 శాతం మంది నలుగు కాని వారున్నారని, ఇప్పుడు అందులో తాము సవరణలు చేశామన్నాడు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నామన్నాడు. కనీసం రెండు సినిమాల్లో నటించి, అవి థియేటర్లలో లేదా ఓటీటీలలో విడుదలై ఉంటే.. వారికి మాత్రమే మాలో శాశ్వత సభ్యత్వం ఇస్తామన్నాడు. అలాగే.. కనీసం 10 సినిమాల్లో 5 నిమిషాలు కనిపించి, డైలాగ్ చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్టులకి అసోసియేట్ సభ్యత్వం మంజూరు చేస్తామని వెల్లడించాడు. అయితే.. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు ఉండదని తేల్చి చెప్పాడు.
మా అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్నవాళ్లే సినిమాల్లో నటించాలని తాము నిర్మాతలకు సూచించామని మంచు విష్ణు అన్నాడు. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే.. వాళ్లకు మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నాడు. పెన్షన్ విషయంలోనూ మార్పులు చేశామని.. 60 ఏళ్లు పైబడి, సొంత ప్రాపర్టీ లేకుండా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నాడు. ఒకవేళ మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. సమస్యలుంటే లోపలే చర్చించుకోవాలని, బయటకెళ్తే మాత్రం తాము మద్దతివ్వమని అన్నాడు. ‘మా’కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన, సస్పెండ్ అయినా.. వాళ్లు మా ఎన్నికలకు అర్హులు కారని అన్నాడు. ఇక మా కమిటీ పెద్దలుగా తాము మోహన్ బాబు, గిరిబాబు, జయసుధ, స్వప్నదత్‌లను నియమించుకున్నామని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. చివరగా మా బిల్డింగ్ గురించి మాట్లాడుతూ.. తాము పెట్టిన మీటింగ్‌లో అందరూ ఏకగ్రీవంగా కొత్త బిల్డింగ్ కావాలని అడిగారని, అది పూర్తవ్వడానికి మూడు నుంచి నాలుగేళ్లు అవుతుందన్నాడు. తన సొంత డబ్బులతోనే దాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చాడు.