హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో…