తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర…