Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది.