Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.