ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.