సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు విష్ణుమూర్తి దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో నారాయణుడి విగ్రహం మత్స్యకారులకు దొరికింది. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు శంఖు, చక్రాలు ధరించిన శ్రీమన్నారాయణుడి ప్రతిభ లభ్యమైంది. ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లు తన్మయత్వం చెంది భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించారు.